హిందీలో ఆయనే ఖైదీ
on Feb 28, 2020

తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధిస్తుందని విడుదలకు ముందు ఎవరూ ఊహించలేదు. అప్పటికి కార్తి నటించిన రెండు మూడు సినిమాలు అంచనాలను తల్లకిందులు చేయడంతో ‘ఖైదీ’ని లైట్ తీసుకున్నారు. అనూహ్యంగా ప్రేక్షకులు అందరినీ ఆ సినిమా ఆకట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో తీసిన సినిమా కాదు. అందులో హీరోయిన్ లేదు. అయినా... సూపర్ స్ర్కీన్‌ప్లే, డైరెక్టర్ టేకింగ్ తోడవడంతో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నారు. హిందీలో ఆయనే ‘ఖైదీ’ అన్నమాట! తమిళంలో సినిమాను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ హిందీలో అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, రిలయన్స్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది. సినిమా అనౌన్స్ చేయడంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



